calender_icon.png 25 November, 2025 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిక్షలు పడ్డది ఎందరికి?

25-11-2025 01:01:12 AM

  1. గత ఐదేళ్లలో 621 ఏసీబీ కేసులు
  2. ప్రాసిక్యూషన్ అనుమతుల కోసం ఏళ్ల తరబడి మూలుగుతున్న 519 ఫైళ్లు
  3. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి
  4. సీఎంకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 24 (విజయక్రాంతి): రాష్ర్టంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వలపన్ని పట్టుకుంటున్నా... ప్రభుత్వ పెద్దలు, సచివాలయ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా అవినీతిపరులకు శిక్షలు పడటం లేదని, ఇది వారిలో మరింత ధీమాను పెంచుతోందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంచలన ఆరోపణలు చేసింది.

ఏసీబీ కేసుల ఫైళ్లకు ప్రాసిక్యూషన్ అనుమతులు ఇవ్వడంలో ప్రభుత్వం చూపుతున్న తీవ్ర జాప్యం అవినీతికి పరోక్షంగా ఊ తమిస్తోందని పేర్కొంటూ, ఫోరం అధ్యక్షుడు ఎం పద్మనాభరెడ్డి సోమవారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. లేఖలో ఫోరం సంచలన గణాంకాలను బయటపెట్టింది. ఏసీబీ పనితీరును ప్రశంసిస్తూనే, ప్రభుత్వ స్థాయిలో జరుగుతున్న జాప్యాన్ని ఎత్తిచూపింది. ‘సగటున రోజుకు ఒకరిని, కొన్నిసార్లు ఇద్దరు ముగ్గురిని ఏసీబీ అధికారులు పట్టుకుంటున్నారు.

గత ఐదేళ్లలో రాష్ర్టవ్యాప్తంగా 621 మంది అవినీతి అధికారులపై కేసులు నమో దు చేశారు. అయితే, ఆ తర్వాతి ప్రక్రియే నీరుగారిపోతోంది. ఈ 621 కేసుల్లో 519 కేసుల విచారణను ఏసీబీ పూర్తి చేసి, నిందితులపై కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసేం దుకు అవసరమైన ప్రాసిక్యూషన్ అనుమతి కోసం ప్రభుత్వానికి ఫైళ్లు పంపింది. కానీ, ఆ ఫైళ్లు సచివాలయంలో ఏళ్ల తరబడి మూలుగుతున్నాయి.

ప్రభుత్వ అనుమతి లేనిదే ఏసీబీ కోర్టులో ముందడుగు వేయలేదు, అని పద్మనాభరెడ్డి తన లేఖలో పేర్కోన్నారు. ఈ జాప్యం కారణంగా అవినీతి అధికారులకు శిక్షలు పడటానికి 10 నుంచి 15 ఏళ్లు పడుతోందని, ఆలోగా చాలామంది పదవీ విరమణ కూడా చేస్తున్నారని ఫోరం పేర్కొం ది. సచివాలయంలో పైరవీ చేసుకుని సులభంగా బయటపడొచ్చు అనే భావన ఉద్యో గుల్లో బలంగా నాటుకుపోయిందన్నారు.

ఉన్నతాధికారులు ఈ ఫైళ్లను పట్టించుకోకపోవడంతో కింది స్థాయిలో సెక్షన్ ఆఫీసర్లు అవినీతి అధికారులకు కొమ్ముకాస్తున్నారు ని లేఖలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నిర్ల క్ష్యం వల్ల ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా లంచం ఇవ్వందే సామాన్యుడి పని జరగడం లేదని, ఇది ప్రభుత్వ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఫోరం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తక్షణమే జోక్యం చేసుకుని, పెండింగ్‌లో ఉన్న ఫైళ్లకు ప్రాసిక్యూషన్ అనుమతులు మంజూరు చేసి, అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.