23-09-2025 01:11:46 AM
సెట్బ్యాక్ స్థలాల ఆక్రమణలు తొలగించాలని డిమాండ్
సిద్దిపేట, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): ప్రజా ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న రాజకీ య నాయకులు అక్రమ నిర్మాణాలను ప్రో త్సహించడం సిగ్గుచేటుగా ఉంది. సెట్ బ్యాక్ స్థలాలలో గల నిర్మాణాలను మున్సిపల్ అ ధికారులు తొలగించొద్దంటూ కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుపడడం విడ్డూరంగా ఉంది. ప్రజలకు సేవ చేయాల్సిన నా యకులు ఆస్పత్రి భవనాల యజమానుల వ ద్ద ఎంత తీసుకొని వంత పాడుతున్నారం టూ స్థానికులు ఆరోపిస్తున్నారు.
సిద్దిపేట ప ట్టణంలోని శివాజీ నగర్లో పార్కింగ్ సమస్యలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతు న్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల జోన్లో పార్కిం గ్ స్థలాలు లేకపోవడంతో ఆసుపత్రులకు వచ్చే ప్రజలు రోడ్లపైనే వాహనాలు నిలిపివేస్తున్నారు.
దీంతో బాటసారులు, వాహనదా రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను విజయక్రాంతి దినప త్రిక వరుస కథనాలతో వెలుగులోకి తీసుకు రాగా, మున్సిపల్ అధికారులు సెట్బ్యాక్ స్థలాల్లో ఏర్పాటైన అక్రమ నిర్మాణాలైనా మె ట్లు, గద్దెలు, జనరేటర్లు, ప్రచార ఫ్లెక్సీలు తొలగించేందుకు ముందడుగు వేశారు.అ యితే ప్రజలకు మేలు చేయాల్సిన కొంతమంది రాజకీయ నాయకులు అధికారులకు అడ్డుపడటం ప్రజల్లో ఆగ్రహం రేపుతోంది.
అక్రమ నిర్మాణాలను కూల్చివేయకుండా, ఒ క్క ఆసుపత్రి భవన యజమానుల కోసం వ త్తాసు పలుకుతూ మిగతా ప్రజల జీవితాల ను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన నాయకులే ఎంత తీసుకొని వంత పాడుతున్నారో ప్రజలే ప్రశ్నిస్తున్నారు అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి.
ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టుపక్కల నివాసముంటున్న వారికి తీవ్ర ఇబ్బందులు తలె త్తుతున్నాయి. ఇంటి ముందు బైక్ పెట్టుకునే స్థలం కూడా లేకుండా పోయిందని వారు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు ప్ర జల కోసం చర్యలు చేపట్టగా, రాజకీయ నేత లు అడ్డుపడటం సిగ్గుచేటని స్థానికులు మం డిపడుతున్నారు.
ఆస్పత్రి భవనాల యజమానులు సెట్బ్యాక్ స్థలాల్లో నిర్మించిన మె ట్లు, గద్దెలు, జనరేటర్లు, ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ నాయకుల బెదిరింపులకు లొంగిపోకుండా మున్సిపల్ అధికారులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని కోరుతున్నారు. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే వెం టనే స్పందించి ప్రైవేట్ ఆసుపత్రుల జోన్లో నెలకొన్న పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలను శాశ్వ తంగా పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.