calender_icon.png 23 September, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రిడ్జి నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేయాలి

23-09-2025 01:09:50 AM

  1. ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ్మ

జోగిపేట- అజ్జమర్రి బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష

ఆందోల్ (సంగారెడ్డి), సెప్టెంబర్ 22 :రెవి న్యూ, ఆర్‌అండ్బి, ఇరిగేషన్ శాఖల అధికారు లు సమన్వయం చేసుకొని బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని మంత్రి దామోదర్ రాజ నర్సింహ్మ అధికారులకు ఆదేశించారు. సో మవారం అందోల్ నియోజకవర్గంలో మం త్రి పర్యటించారు. ఈ సందర్భంగా జోగిపేట పట్టణంలో ఆర్‌అంబ్బి, ఇరిగేషన్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో స మీక్షా సమావేశం నిర్వహించారు.

జోగిపేట- అజ్జమర్రి బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతి అ ధికారులతో మంత్రి చర్చించారు . ఈ సమీక్షలో బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన భూ సే కరణ పూర్తి చేయాలనీ మంత్రి ఆదేశించారు. బ్రిడ్జికు అనుసంధానం చేసే అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని మంత్రి దిశానిర్శనం చేశారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలన్నారు.

జిల్లాలో ఇటీ వల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, ఇందుకు పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశించారు.  మత్తకేసారం రోడ్డు నిర్మాణం పనులు, కుసులూరు_గార్లపల్లి రహదారి నిర్మాణం పనుల పురోగతిపై మంత్రి అడిగి తెలుసుకున్నారు. 

పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్బి ఈఈ వసంత్ నాయక్, నర్సింహులు, డీఈ రవీందర్, ఏఈఈ శశాంక్, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.