14-10-2025 12:36:18 AM
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్
కొమురవెల్లి, అక్టోబర్ 13: సన్న వడ్లకే కాక దొడ్డొడ్ల పండించిన రైతుకు క్వింటాల్ 500 బోనస్ ఇవ్వాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంతో పాటు, అయినా పూర్, కిష్టంపేట గ్రామాలలో కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధాన్యం పండించిన ప్రతి రైతుకు క్వింటాల్ కు 500 బోనస్ చెల్లిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సన్న వడ్లకు మాత్రమే చెల్లిస్తామనడం సరికాదన్నారు.
ఇచ్చిన హామీ ప్రకారం హామీని నెరవేర్చ బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దొడ్డువడ్లకు బోనస్ ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత సీజన్లోని సన్నావోడ్ల బోనస్ రైతులకు బకాయిపడి ఉందని, వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఆనాడు కెసిఆర్ సీఎంగా ఉన్నప్పుడు అధికారులతో సమీక్షించి ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేశారని, వాటినే ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తుందని గుర్తు చేశారు.
రాష్ట్రంలో తాగు విస్తీర్ణం పెంచిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సాగు విస్తీర్ణంలో మన రాష్ట్రం 14వ స్థానంలో ఉండగా గత పది ఏళ్లలో రెండో స్థానంలోకి తీసుకువచ్చారని ఆయనను కొనియాడారు. వరి ఉత్పత్తిలో భారతదేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ స్థానంలో నిల్పడంలో కేసీఆర్ విశేష కృషి ఉందన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం ఉన్న సాగునీటిని సక్రమంగా వినియోగించడం చేతనైతే లేదని ఎద్దేవా చేశారు. తపాస్ పల్లి రిజర్వాయర్ల్ లోకి నీరు ఆలస్యంగా వచ్చిందని, వచ్చిన నీరు వృధాగానే పోతుందని, ఆ నీటిని సద్వినియోగం చేయడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న రిజర్వాయర్లలో నీటి లీకేజీలను అరికట్టాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు.
తపస్పల్లి రిజర్వాయర్ లో నీటిని నిల్వచేసి యాసంగి పంటకు నీరు సకాలంలో అందే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కాంట అయిన వెంటనే డబ్బులు రైతు ఖాతాలో పడేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రైస్ మిల్లర్ ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా అధికారులను నిఘా పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ వర్మ, ఐకిపీ అధికారులు, టి బిఆర్‌ఎస్ నాయకులు బొంగు రాజేందర్ రెడ్డి, మెరుగు కృష్ణ, పబ్బుజో విజయేందర్, గొల్లపల్లి కిష్టయ్య, పడగన్న గారి మల్లేశం ముత్యం నర్సింలు, ఎరుపుల మహేందర్, కొండ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.