calender_icon.png 14 October, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిస్ ఒలింపిక్స్ మెడలిస్ట్‌లకు ఐవోఏ సత్కారం

14-10-2025 12:34:36 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన క్రీడాకారులను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఎ) ఘనంగా సత్కరించింది. జావెలిన్‌త్రోలో సిల్వర్ మెడల్ గెలిచిన నీరజ్ చోప్రా, షూట ర్లు మనుబాకర్,సరబ్‌జోత్‌తో సహా పతకా లు గెలిచిన క్రీడాకారులందరికీ కేంద్ర క్రీడా శాఖమంత్రి మన్సుక్ మాండవీయ, ఐ వోఏ ప్రెసిడెంట్ పీటీ ఉష చేతుల మీదుగా నగదు పురస్కారాలకు సంబంధించి చెక్కుల ను అందజేశారు.

నీరజ్ చోప్రా ప్రస్తుతం విదేశాల్లో ఉండడంతో అతని తరపున ఐవో ఏ ప్రతినిధి రూ.75 లక్షల రూపాయల చెక్ ను అందుకున్నారు. మనుబాకర్, సరబ్‌జోత్ రూ.50 లక్షల చొప్పున నగదు పురస్కారాలను అందుకున్నారు.మరో షూటర్ స్వప్నిల్ కుశాలే, రెజ్లర్ అమన్ సెహ్రావత్ కూడా రూ.50 లక్షల నజరానా అందుకున్నారు.  పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భార త హాకీ జట్టులో ఒక్కో ప్లేయర్‌కూ రూ.10 లక్షల చొప్పున నజరానా అందజేశారు. ప లువురు ఐవోఏ సభ్యులు పాల్గొన్నారు.