calender_icon.png 14 October, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిన్నెరసానికి వరద పోటు

14-10-2025 12:36:56 AM

- 406.60 అడుగులకు చేరిన జలాశయం 

-19వేల క్యూసెక్కుల నీరు విడుదల 

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 13 (విజయక్రాంతి): జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం యానంబైలు వద్ద గల కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు జలాశయం నీటిమట్టం 406.60 అడుగులకు చేరుకుంది. కొత్తగా 19వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నాయి. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 407 అడుగులు కాగా, ప్రస్తుతం 406.60 అడుగులకు చేరుకోవడంతో అప్రమత్తమైన జనుకో అధికారులు 4 గేట్లను ఎత్తి 19వేల క్యూసెక్కుల నీటిని బయటికి పంపుతున్నారు.