calender_icon.png 17 December, 2025 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ లో భారీ చేరికలు

16-12-2025 06:52:46 PM

టేకులపల్లి (విజయక్రాంతి): ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో టేకులపల్లి గ్రామ పంచాయతీలోని 9, 10వ వార్డులలోని పలు కుటుంబాలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఇస్లావత్ రెడ్యానాయక్ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. భూక్య బిగనా నాయక్, దారావత్ చంప్లా నాయక్, దారావత్ లక్ష్మ నాయక్, అజ్మీరా బద్దు నాయక్, బాలు నాయక్, గుగులోత్ సెట్రాం, దారావత్ కృష్ణ, భూక్య బుజ్జి, దారావత్ కాళీ, దారావత్ చిట్టీ, దారావత్ కాంతి, గుగులోత్ సునీత, బానోత్ కోన తదితరులు చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గ నాయకులు కోరం సురేందర్, ఈది గణేష్, టేకులపల్లి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఇస్లావత్ రెడ్యానాయక్, నర్సింగ్ లక్ష్మయ్య, బోడ మంగీలాల్, మూడ్ గణేష్, నల్లమోతు వెంకన్న, జాటోత్ కిరణ్, భూక్య ఉష, దారావత్ సుమన్, రామారావు తదితరులు పాల్గొన్నారు.