19-07-2025 12:00:00 AM
- పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
మూసాపేట జూలై 18 : అడ్డాకుల మండల కేంద్రానికి చెందిన బిజెపి మండల మాజీ అధ్యక్షుడు బుచ్చన్న యాదవ్ బిజెపి యువ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి , వెంకటేష్ యాదవ్ తోపా టు పెద్ద ఎత్తున బిజెపి నాయకులు, కార్యకర్తలు బిఆర్‌ఎస్ నాయకులు టంకరి వెంకటేష్, గొల్ల మన్నెంకొండ, సునీల్, రత్నం, యాకోబు, వీరేష్, వెంకటేష్ యాదవ్, గొల్ల బాబు, రాములు యాదవ్ తో పలువురు బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలు, ముఖ్యంగా నిరంతరం ప్రజలకు అందు బాటులో ఉంటూ, దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూ, ఎన్నో ప్రతిష్టాపకమైన సంస్థలను దేవరకద్ర నియోజకవర్గం లో స్థాపిస్తూ, 18 నెలల కాలంలోనే నియోజ కవర్గానికి 500 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి, నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న దేవరకద్ర ఎమ్మెల్యే నాయకత్వాన్ని మెచ్చి, కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తోట శ్రీహరి,సీనియర్ నాయకుడు దశరథరెడ్డి, విజమోహన్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షులు షఫీ , వేగానాథ్ , రమేష్, పాల్గొన్నారు.