31-01-2026 02:20:49 AM
కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో అందజేత
హైదరాబాద్, జనవరి 30: కోఠిలోని ప్రభుత్వ ఈఎన్‌టీ ఆసుపత్రిలో శుక్రవారం టీఎన్జీవోస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కుమార్, కార్యదర్శి కురాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా నేతలు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద ఆచార్య, ఆర్‌ఎమ్‌ఓ డాక్టర్ అనిల్ కుమార్‌ని మర్యాదపూర్వకంగా కలిసి డైరీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కేఆర్ రాజ్ కుమార్, పబ్లిసిటీ సెక్రటరీ వైదిక శాస్త్రి, కార్యదర్శి శ్రీధర్ నాయుడుతో పాటు యూనిట్ ప్రతినిధులు భాస్కర్, రవి, శ్రీహరి, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదే సందర్భంలో ఈఎన్‌టీ యూనిట్ అధ్యక్షులు తూముకుంట రాజు ఆసుపత్రిలో ఎదురవుతున్న పలు సమస్యలను జిల్లా నేతల దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సానుకూలంగా స్పందిస్తూ, ఈ సమస్యను వెంటనే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో టీఎన్జీవోస్ ఎల్లప్పుడూ ముందుంటుందని వారు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.