calender_icon.png 5 July, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

05-07-2025 12:42:47 AM

  1. నలుగురి అరెస్ట్, రిమాండ్ 
  2. అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి

కామారెడ్డి, జూలై 4 (విజయ క్రాంతి): ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా నిలువ ఉంచిన భారీ పేలుడు పదార్థాలను పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో అక్రమంగా నిల్వ ఉంచిన జిలేటి స్టిక్స్ పేలుడు పదార్థాలు కలిగి ఉన్నారని సమాచారం ఏమనగా కామారెడ్డి పోలీసులు దాడులు నిర్వహించి భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేసినట్లు ఏ ఎస్ పి చైతన్య రెడ్డి తెలిపారు.

శుక్రవారం కామారెడ్డి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కామారెడ్డి  ప్రో బెల్స్ స్కూల్ వెనకాల KPR కాలనీ లో  ఒక ఓపెన్ ప్లాట్ లో గల బండరాళ్ళను తొలగించడానికి ముగ్గురు వ్యక్తులు జలటన్ స్టిక్స్, డిటోనేటర్, కార్డెక్స్ వైర్లను ఉపయోగించి, బండరాళ్ళను బ్లాస్టింగ్ చేస్తున్నారని సమాచారం రాగా  జిల్లా ఎస్ పి  రాజేష్ చంద్ర  ఆదేశాల మేరకు,  కామారెడ్డి ఏ ఎస్ పి  ప్రత్యేక పర్యవేక్షణలో కామారెడ్డి పట్టణ ఇన్స్పెక్టర్ నరహరి, పోలీస్ సిబ్బందితో కలిసి గురువారం రాత్రి KPR కాలనీ కి వెళ్లినట్లు తెలిపారు. 

ముగ్గురు వ్యక్తులు శ్రీధర్ అనే వ్యక్తి యొక్క ఓపెన్ ప్లాట్‌లో ఉన్న బండరాళ్ళను తొలగించడానికి బండరాళ్ళకు డ్రిల్లింగ్ చేసి అందులో జలటన్ స్టిక్స్ అమర్చి దానికి ప్రయత్నిస్తుండగా జలటిన్ స్టిక్స్, డీటోనేటర్ వైర్, కార్డేక్స్ వైరు సహాయంతో బ్యాటరీ ద్వారా పేల్చడానికి సిద్ధంగా ఉంచినారు.

అట్టి ముగ్గురు వ్యక్తులను పట్టుకొని విచారించగా వారు ప్లాట్లో ఉన్న బండరాళ్లను  జలటిన్ స్టిక్స్, డిటోనేటర్, కార్డేక్స్ వైరు ఉపయోగించి పగలగొట్టడానికి ఎలాంటి ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా  ఇండ్ల మధ్యలో ఉందని తెలిసి పక్కనే ఫ్రొబెల్స్ స్కూల్ పిల్లలు, చుట్టుపక్కల నివాస గృహాలలోని ప్రజల ప్రాణాలకు హాని, ఆస్తి నష్టం జరగవచ్చని తెలిసి కూడా బండరాళ్ళను పేల్చేయడానికి ప్రయత్నిoచి నట్లు ఏ ఎస్ పి చైతన్య రెడ్డి తెలిపారు.

అందుకు గాను  ప్లాట్ యజమాని  శ్రీధర్ దగ్గర 50,000/-రూ.లకు ఒప్పందం కుదుర్చుకొని అడ్వాన్సుగా రూ.5 వేలు  తీసుకున్నారు.  వారు వాడిన జలటిన్ స్టిక్స్, డిటోనేటర్, కార్డేక్స్ వైరు కామారెడ్డి పట్టణ పరిధిలోని లింగాపూర్ గ్రామ శివారులోని లోని  ఓ ప్రైవేట్ వెంచర్ దగ్గర నుండి తెచ్చారు. 

తదుపరి విచారణలో   వెంచర్లోని రాళ్ళను తొలగించడానికి శంకర్, స్వామిల ద్వారా ఈ పేలుడు పదార్థాలు తెప్పించి వెంచర్లోని రేకుల షెడ్డులో అధిక మొత్తంలో జలటిన్ స్టిక్స్, డిటోనేటర్, కార్డేక్స్ వైరు దాచినట్లు తెలిపారు.

పట్టణ సిఐ నరహరి లింగాపూర్ గ్రామ శివారులోని  ఓ ప్రైవేట్ వెంచర్ లోని రేకుల షెడ్డులో ఎటువంటి ప్రబుత్వ అనుమతి లేకుండా, అక్రమంగా నిల్వ ఉంచిన జలటన్ స్టిక్స్, డిటోనేటర్,లు, కార్డెక్స్ వైర్లు ఉండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 1564-  జలటన్ స్టిక్స్ , 41- డిటోనేటర్స్, 16 బండల్స్ ఆర్ వైర్లు బండల్స్ -16( సుమారు 4300 మీటర్లు )  ఒక బ్యాటరీ, ఒక చెక్ మీటర్, రెండు బజాజ్ ప్లాటిన మోటార్ సైకిళ్ళు, నాలుగు  సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కామారెడ్డి జిల్లా శ్రీనివాస్ నగర్ లో నివాసం ఉంటున్న నల్గొండ జిల్లా చెందిన బొంత,సంపత్, బొంత లక్ష్మీనారాయణ, బొంత రాజు, ప్లాటు యజమాని చింతల శ్రీధర్ లను చాకచక్యంగా పట్టుకొని పెద్ద మొత్తంలో జిలేటిన్ స్టిక్స్, డీటోనేటర్లు, కార్డ్ ఎక్స్ వైరులు, గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఏ ఎస్ పి చైతన్య రెడ్డి తెలిపారు.

ముందస్తు పర్మిషన్ లేకుండా ఎవరు కూడా ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ఆస్తులకు నష్టం చేకూర్చే పేలుడు పదార్థాలను కలిగి ఉండ రాదని తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ నరహరి, ఎస్త్స్ర శ్రీరామ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.