calender_icon.png 24 August, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విదేశీ ట్రావెల్, విద్యా వ్యయాల్లో భారీ కోత

23-08-2024 12:30:00 AM

అధిక పన్నుల భారమే కారణం

న్యూఢిల్లీ, ఆగస్టు 22: భారతీయులు విదేశీ వ్యయాల్ని భారీగా తగ్గించుకుంటున్నారు. విదేశీ ప్రయాణాలు, విద్యకు, విదేశీ కొనుగోళ్లకు దేశీయుల రెమిటెన్సు లు జూన్‌లో 44 శాతం తగ్గి 2.2 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. గత ఏడాది ఇదే నెలలో ఈ రెమిటెన్సులు 3.9 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. ఈ ఏడాది మేలో చేసిన 2.4 బిలియన్ డాలర్ల వ్యయాలతో పోల్చినా, జూన్‌లో తగ్గాయి. ఆర్బీఐ తాజా సమాచారం ప్రకారం ట్రావెల్, విదేశీ విద్య, సన్నిహితుల జీవనానికి పంపించే డబ్బు బాగా తగ్గింది. ట్రావెల్ రెమిటెన్సులు 1.5 బిలియన్ డాలర్ల నుంచి 1.3 బిలియన్ డాలర్లకు, స్టడీస్ రెమిటెన్సులు 237 మిలియన్ డాలర్ల నుంచి 177 మిలియన్ డాలర్లకు క్షీణించాయి.