calender_icon.png 15 August, 2025 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేఎల్‌ఐ కాల్వకు భారీ గండి

11-08-2025 01:10:56 AM

కల్వకుర్తి ఆగస్టు 10 కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలోని లచ్చపురం సమీపంలోనీ డి-82 కేఎల్‌ఐ కాల్వకు ఆదివారం గండిపడి వరద నీరు వృధాగా పారుతోంది. ఏటా ఇదే తంతు కొంసాగుతోందని రెండేళ్లలోనే ఐదుసార్లు గండి పడిందని అయినా అధికారులు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ప్రతి ఏటా పంటపొలాలు నీట మునుగుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆదివారం స్థానిక ప్రజాప్రతినిధులు ఆయా వివాహ వేడుకల్లో మాత్రం బిజీగా ఉన్నారు తప్ప రైతుల పంట పొలాలు వరద నీటిలో కొట్టుకుపోతున్న పట్టించుకోకపోవడం పట్ల రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గండిపడిన కాలువలకు మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉన్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో రైతులు వారి పంట పొలాలు గట్లు ఇతర వ్యవసాయ పనిముట్లు విద్యుత్ స్తంభాలు వంటివి పూర్తిగా వరద నీటిలో కొట్టుకుపోవడం తీవ్ర ఆందోళన తొలగిస్తోంది. ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకోక పోవడంతో కేఎల్‌ఐ  ప్రాజెక్టు లక్ష్యం నీరు గారిపోతోందని రైతులు మండిపడుతున్నారు.