calender_icon.png 28 September, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోబోటిక్ టెక్నాలజీ విద్యార్థులకు వరం

28-09-2025 04:46:04 PM

ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు..

వాజేడు మండలంలో ఏటీసీ భవనం ప్రారంభోత్సవం.. 

వాజేడు (విజయక్రాంతి): మారుమూల ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు రోబోటిక్ టెక్నాలజీ స్కిల్ డెవలప్మెంట్ అందించడం ఈ ప్రాంత విద్యార్థులకు ఒక వరం అని భద్రాచలం శాసనసభ సభ్యులు తెల్ల వెంకటరావు అన్నారు. శనివారం వాజేడు మండల కేంద్రంలో గల ఐటిఐ ప్రాంగణంలో నిర్మించిన ప్రభుత్వం, టాటా కంపెనీ వారి సహకారంతో నిర్మించిన ఏ టి సి భవనమును అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈ ప్రారంభానికి విచ్చేసిన ఎమ్మెల్యే తెల్ల వెంకటరావుకు ఘన స్వాగతం పలుకుతూ వేదమంత్రాలతో రిబ్బన్ కట్ చేసి భవనమును ప్రారంభించారు. అనంతరం ఐటీడీఏ ద్వారా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో భద్రాచలం నియోజకవర్గానికి ప్రభుత్వం అందించిన సహాయ సహకారాల గురించి వివరిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంతరం రాష్ట్రంలో ప్రారంభమైన 65 ఏ టి సి భవనాల గూర్చి వాటితో అందిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ గూర్చి ముఖ్యమంత్రి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. తర్వాత ఏ టి సి ద్వారా విద్యార్థులకు అందిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో మారుమూల గిరిజన విద్యార్థులకు రోబోటిక్ టెక్నాలజీ అందించాలని ప్రభుత్వ సంకల్పానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. పారిశ్రామిక రంగంలో ఏటీసీ ద్వారా విప్లవాత్మకమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిస్తుందని తెలియజేశారు. ఈ ప్రాంత విద్యార్థులు ఈ సదా అవకాశాన్ని వినియోగించుకొని జీవితములో ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏటూర్ నాగారం ఐటీడీఏ పీవో చిత్రమిశ్రా, స్థానిక ఎమ్మార్వో శ్రీనివాస్, ఎంపీడీవో విజయ, ఎంపీ ఓ శ్రీకాంత్ నాయుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దంతులూరి ప్రసాద్ బాబు రాజు, మాజీ జెడ్పిటిసి తల్లడి పుష్పలత, పిఎసిఎస్ అధ్యక్షులు ఎగ్గడి అంజయ్య, చిడం మోహన్ రావు, కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్, తదితరులు పాల్గొన్నారు.