11-10-2025 12:00:00 AM
రవితేజ ప్రస్తుతం తన 76వ సినిమా కోసం పనిచేస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. హ్యూమర్, ఎమోషన్, రవితేజ మాస్ ఎలిమెంట్స్ తో ఫుల్-ఫ్లెడ్జ్డ్ ఫ్యామి లీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్ మహారాజ న్యూ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ ప్రాజెక్టు తాజా అప్‌డేట్‌ను టీమ్ పంచుకుంది.
చిత్రబృందం ప్రస్తుతం ఫారిన్ చేరుకుంది. కొన్ని రోజులుగా స్పెయిన్‌లోని వాలెన్షియా, సమీప దీవుల్లో లొకేషన్ రెక్కీ పనులు పూర్తిచేసిన టీమ్.. శుక్రవారం షూటింగ్‌ను ప్రారంభించింది. ఈ షెడ్యూల్ మొత్తం 25 రోజులు కొనసాగనుండగా కీలక టాకీ పార్ట్స్‌తోపాటు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీతో రెండు పాటలు చిత్రీకరించనున్నారు. తర్వాత జెనీవా, ఫ్రాన్స్‌లో కూడా కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
ఈ ప్రాజెక్టుకు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే, టైటిల్, ఫస్ట్ లుక్, నటీనటుల వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేయనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్. ఎడిటర్‌గా శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్‌గా ఏఎస్ ప్రకాశ్ పనిచేస్తున్నారు.