11-10-2025 12:00:00 AM
‘లవ్‌టుడే’, ‘డ్రాగన్’లతో రెండు వరుస హిట్లు అందుకున్న యువ హీరో ప్రదీప్ రంగనాథన్. ఇప్పుడు ‘డ్యూడ్’ అంటూ దీపావళికి ప్రేక్షకులముందుకు వస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో కీర్తీశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. ‘ప్రేమలు’ తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు ఈ సినిమాలో మరోమారు హీరోయిన్‌గా జత కడుతోంది. ఇందులో సీనియర్ నటుడు శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్టోబర్ 17నతెలుగు,తమిళం,హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా శరత్ కుమార్ విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు.
కథలో ముఖ్య భాగమయ్యే పాత్రలు చేయడానికి ఇష్టపడతాను. డైరెక్టర్ కీర్తీశ్వరన్ చెప్పిన ‘డ్యూడ్’ కథ అద్భుతంగా ఉంది. చాలా కొత్త పాయింట్.
చాలా ఎమోషనల్ ఫిల్మ్ -ఇది. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి కంటెంట్ ఉంది. ఒక ఫ్యామిలీలో ఇలాంటి సంఘటన జరిగితే సమాజం ఎలా స్పందిస్తుందనే కోణంలో డైరెక్టర్ ఆవిష్కరించారు. రెగ్యులర్ సినిమాలా ఉండదు. కామెడీ హ్యూమర్ ఎమోషన్ అన్నీ విభిన్నంగా చూపించారు.
నేను ప్రదీప్‌కు అంకుల్‌గా కనిపిస్తాను. నా పాత్ర కథలో ఎంతో క్రూషియల్. ఈ క్యారెక్టర్ చేయడం చాలా ఉత్సాహంగా అనిపించింది. చాలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అలాంటి పాత్రలో నటించటం కూడా చాలా కష్టం. సవాల్‌తో కూడుకున్న పని. నా క్యారెక్టర్‌కు సంబంధించి రూల్స్, కండీషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి.
నేను డిఫరెంట్ జనరేషన్ డైరెక్టర్లలో పనిచేస్తూ వస్తున్నాను. -అందరూ టెక్నికల్‌గా సౌండ్ ఉంటారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువైంది. ఇప్పటి డిజిటల్ టెక్నాలజీకి తగ్గట్టు మేకర్స్ అప్డేట్ అవుతూ ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నారు. చాలా కొత్త విషయాలు నేర్చుకుంటు న్నాం. -అప్పటికీ ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు. మంచి కథలు, పాత్రలు చేయాలనే తపనే ఎప్పుడూ ఉంటుంది.
షాట్ ఓకే అయిన తర్వాత నటీనటులు మానిటర్ చూస్తుంటారు. మానిటర్ చూడటం డైరెక్టర్ పని. ఆయనకు ఓకే కాకపొతే మరో టేక్ చెబుతారు. అంతేకానీ, యాక్టర్స్ ప్రతిసారి వెళ్లి మానిటర్ చూడటం సమయం వృథా అని నా భావన.
సుభాష్ చంద్రబోస్ నా డ్రీమ్ రోల్. ఆయన బయోపిక్ చేయాలని ఉంది. ఆ అవకాశం రావాలని కోరుకుంటున్నా. ఇప్పుడు -మిస్టర్ ఎక్స్ అనే సినిమా చేస్తున్నా. నవంబర్‌లో ఒక సినిమా రిలీజ్‌కు ఉంది. బాలీవుడ్‌లో ఒక సినిమా చేస్తున్నా. గౌతమ్ మీనన్‌తో కలిసి మరో సినిమా చేస్తున్నా.