04-12-2025 12:40:46 AM
రాయ్‌పూర్, డిసెంబర్ 3 : టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగిన భారత్‌కు సరైన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు జైస్వాల్(22), రోహిత్ శర్మ(14) త్వరగానే ఔటయ్యారు. తొలి వికెట్‌కు భారత ఓపెనర్లు 40 పరుగులు జోడించారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ కలిసి జట్టును ఆదుకున్నారు. ఆరంభంలో కాస్త సమయం తీసుకున్న వీరిద్దరూ తర్వాత సఫారీ బౌలర్లను ఆటాడుకున్నారు.
సింగిల్స్,డబుల్స్ తీస్తూ.. మధ్యమధ్యలో బౌండరీలు బాదుతూ వేగంగా పరుగులు చేశారు. ఈ క్రనంలో రుతురాజ్ గైక్వాడ్ 52 బంతుల్లో, కోహ్లీ 47 బం తుల్లో హాఫ్ సెంచరీలు సాధించారు. తర్వాత మరింత దూ కుడుగా ఆడిన వీరిద్దరూ బౌండరీల మోత మోగించారు. 77 బంతుల్లో శతకాన్ని అందుకున్న రుతురాజ్ కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ. వీరిద్దరూ మూడో వికెట్‌కు 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
రుతురాజ్(105) ఔటైన తర్వాత కేఎల్ రాహుల్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ కొనసాగించాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డే కెరీర్‌లో విరాట్‌కు ఇది 53వ సెంచరీ. ఓవరాల్‌గా అంతర్జాతీయ కెరీర్‌లో 84వ శతకం. ఈ క్రమంలో పలు రికార్డు లను కూడా అందుకున్నాడు. వరుసగా రెండు సెంచరీలు చేయడం కోహ్లీకి ఇది 11వ సారి. కోహ్లీ ఔటయ్యాక వాషింగ్టన్ సుందర్ నిరాశపరిచినా రాహుల్, జడేజా దూకుడుగా ఆడారు. రాహుల్ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయగా.. జడ్డూ కూడా ధాటిగా ఆడాడు. దీంతో భారత్ 5 వికెట్లకు 358 పరుగులు చేసింది. రాహుల్ 66, జడేజా 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
359 పరుగుల భారీ లక్ష్యఛే దనలో సౌతాఫ్రికా త్వరగానే ఓపెనర్ డికాక్(8) వికెట్ కోల్పోయింది. అయితే మార్క్మ్,్ర కెప్టెన్ బవుమా కలిసి సఫారీ ఇన్నింగ్స్ నిలబెట్టారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 101 పరుగులు జోడించారు. బవుమా(46) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రతీ బ్యాటర్ విలువైన ఇన్నింగ్స్‌లు ఆడా రు. మార్క్మ్,్ర బ్రీజ్కే కలిసి 70 పరుగులు, బ్రెవిస్ కలిసి 92 పరుగులు భాగస్వామ్యాలు సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాయి. భారీ స్కోరు ఛేదిస్తున్నప్పుడు భాగస్వా మ్యాలు ఎంత కీలకమైనవో ఈ మ్యాచ్ ద్వారా అందరికీ అర్థమవుతుంది.
మార్క్మ్ సెంచరీ(110) సాధించగా.. బ్రెవిస్ (34 బంతుల్లో 54), బ్రీజ్కే(64 బంతుల్లో 68) మె రుపులు మెరిపించారు. ఫలితంగా సాధించాల్సిన రన్‌రేట్ తగ్గుతూ వచ్చింది. దీనికి తోడు భారత బౌలింగ్ పూర్తిగా తేలిపోయింది. మధ్య మధ్యలో వికెట్లు తీసినా కీలక భాగస్వామ్యాలను బ్రేక్ చేయడంలో మన బౌలర్లు విఫలమ య్యారు. అదే సమయంలో చెత్త ఫీల్డింగ్ కూడా కొంపముంచింది.
పసలేని బౌలింగ్‌కు తోడు పేలవమైన ఫీల్డింగ్ కారణంగా భారత్ పరాజయం చవిచూడాల్సి వచ్చింది. పైగా స్లో ఓవర్ రేట్ కారణంగా చివరి 3 ఓవర్ల సమయంలో సర్కిల్ అవతల ఒక ఫీల్డర్ తగ్గడం, మంచు ప్రభావం కూడా టీమిండియా ఓటమికి కారణమైంది.
చివరికి సౌతాఫ్రికా మరో 4 బంతులు మిగిలుండగా టార్గెట్‌ను అందుకుంది. వన్డేల్లో సౌతాఫ్రికాకు ఇది నాలుదో హయ్యెస్ట్ ఛేజింగ్. గతంలో ఆస్ట్రేలియాపై 435, 372 పరుగుల లక్ష్యాలను సఫారీ జట్టే ఛేజ్ చేసింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ప్రస్తుతం 1 సమంగా ఉంది. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే విశాఖలో శనివారం జరుగుతుంది.
స్కోర్ బోర్డు
భారత్ ఇన్నింగ్స్: 358/5 (రుతురాజ్ 105, కోహ్లీ 102, రాహుల్ 66; యెన్సన్ 2/63, బర్గర్ 1/43, ఎంగిడి 1/51)
సౌతాఫ్రికా ఇన్నింగ్స్: 362/6(49.2 ఓవర్లు)( మార్క్మ్ 110, బ్రీజ్కే 68, బ్రెవిస్ 54; అర్షదీప్ 2/54, ప్రసిద్ధ కృష్ణ 2/85, కుల్దీప్ 1/78)