04-12-2025 12:33:34 AM
ముంబై, డిసెంబర్ 3 : సౌతాఫ్రికాతో జరిగే టీ ట్వంటీ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. ఊహించినట్టుగానే వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ జట్టులోకి తిరిగి వచ్చా డు. మెడనొప్పి కారణంగా టెస్ట్ సిరీస్ మధ్యలోనే తప్పుకున్న గిల్ తర్వాత వన్డే సిరీస్‌కూ దూరమయ్యాడు. మెడనొప్పి నుంచి కోలుకుని ప్రస్తుతం ఫిట్‌నెస్ సాధించేక్రమంలో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉన్నాడు.
టీ20 సిరీస్‌కు గిల్‌ను ఎం పిక చేసినప్పటకీ ఫిట్‌నెస్ క్లియరెన్స్ వస్తేనే అతనికి తుది జట్టులో చోటు దక్కుతుంది. ఒకవేళ ఫిట్‌నెస్ సాధించకుంటే మాత్రం వచ్చే సిరీస్‌కే అందుబాటులో ఉంటాడు. అ లాగే ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా కూడా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆసియాకప్ సందర్భంగా గాయపడిన పాండ్యా అప్పటి నుంచీ జట్టుకు దూరమయ్యాడు. ఇటీవలే ఫిట్‌నెస్ క్లియర్ చేసిన ఆ ఆల్ రౌండర్ ప్రస్తు తం సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడుతున్నాడు. రీఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్‌లోనే పంజాబ్‌పై మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశా డు.
ఇదిలా ఉంటే గిల్, హార్థిక్ జట్టులోకి రావడంతో జైస్వాల్, నితీశ్ కుమార్‌రెడ్డిలపై వేటు పడింది. అలాగే కీపర్లుగా సంజూ శాం సన్, జితేశ్ శర్మ ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్ కోటాలో పాండ్యాతో పాటు శివమ్ దూ బే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకోగా..స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఎంపికయ్యారు. పేస్ విభాగంలో వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న బుమ్రా తిరిగి వచ్చాడు. అలాగే అర్షదీప్‌సింగ్, హర్షిత్ రాణా పేసర్లుగా ఎం పికయ్యారు. సౌతాఫ్రికాతో ఐదు వన్డేల సిరీ స్ డిసెంబర్ 9 నుంచి మొదలవుతుంది.
సౌతాఫ్రికాతో టీ20లకు భారత జట్టు :
సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివ మ్ దూబే, వాషింగ్టన్ సుందర్, హార్థిక్ పాం డ్యా, సంజూ శాంసన్(కీపర్), జితేశ్ శర్మ(కీపర్), కుల్దీప్, వరుణ్, అర్షదీప్, బుమ్రా