calender_icon.png 22 September, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానాస్పదంగా కనిపిస్తే చెప్పండి

22-09-2025 12:29:02 AM

డీఎస్పీ వెంకటేశ్వర్లు 

మహబూబ్ నగర్, సెప్టెంబర్ (విజయక్రాంతి): మీరు నివాసం ఉంటున్న ప్రాంతంలో అనుమానస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం నగరంలోని టూ టౌన్ పిఎస్ పరిధిలో గల న్యూ ప్రేమ్ నగర్ లో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ కార్డన్ సెర్చ్ లో 55 మంది అనుమానాస్పద వ్యక్తుల ఆధార్ కార్డులు పరిశీలించడం జరిగిందని, 225 వాహనాలను తనిఖీ చేశామన్నారు.

192 బైకులు 16 ఆటోలు 17 కార్లు వెరిఫై చేసి డాక్యుమెంట్స్ లేని 32 బైకులు మూడు ఆటోలను సీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్ లో మహబూబ్నగర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ గారు, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు, ఉమెన్ పి ఎస్ ఇన్స్పెక్టర్ గారు, మరియు 7గురు ఎస్‌ఐ లు, ఏఎస్‌ఐలలు, 8మంది హెడ్ కానిస్టేబుల్, 40 మంది కానిస్టేబుళ్లు, ముగ్గురు హోంగార్డ్లు మొత్తం 65 మంది పోలీసులు పాల్గొన్నారు.