calender_icon.png 9 August, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే నాణ్యమైన విద్య

08-08-2025 10:08:21 PM

జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గోవింద్ రామ్..

పటాన్ చెరు/జిన్నారం: ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య, సౌకర్యాలు అందుతున్నాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవిందు రామ్(District Intermediate Officer Govind Ram) అన్నారు. మండల కేంద్రం జిన్నారంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు స్వాగతోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్ కళింగ కృష్ణ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గోవిందు రామ్ తో పాటు తహసిల్దార్ దేవదాస్, ఎస్సై హనుమంతు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అనంతరం ద్వితీయ, ప్రథమ సంవత్సర కళాశాల, గ్రూప్ టాపర్లకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. అనంతరం కళాశాల నుంచి పదోన్నతిపై వెళ్లిన కృష్ణారావు, ఐలయ్యను సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.