05-11-2025 01:56:55 AM
ఏడుగురు పై కేసు నమోదు
ఒకరిని అదుపులోకి తీసుకున్న అటవీ అధికారులు
ములకలపల్లి,నవంబర్4(విజయక్రాంతి): విద్యుత్తు సరఫరా అయ్యే తీగలకు వేటగాళ్లు అమర్చిన తీగలకు తగిలి అడవి పంది మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం లో మంగ ళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ములకలపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మామిళ్ళగూడెం అటవీ ప్రాంతం లో సోమవారం రాత్రి వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి అడవి పంది మృతి చెందింది అనే సమాచారం ఫారెస్టు సిబ్బందికి అందడంతో ఆ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు గాలించారు.
వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి అడవి పంది మృతి చెంది ఉంది.మంగళవారం తెల్లవారుజామున వేటగాళ్లు తీగలు అమర్చిన ప్రాం తానికి చేరుకుని అటవీ జంతువులు ఏమైనా తీగలకు తగిలి మృతి చెందాయా?లేదా? అని వెతుకుతున్నారు. అందులోనుండి మా మిళ్లగూడెం గ్రామానికి చెందిన వెదురు చిట్టిబాబు అనే వ్యక్తి పట్టుబడ్డాడు. మిగతావాళ్లు ఫారెస్ట్ సిబ్బందిని చూసి పరారయ్యారు.
మృతి చెందిన అడవి పందిని స్వాధీనం చేసుకొని ములకలపల్లి వెటర్నరీ హాస్పిటల్ లో పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ ఘటనలో పాల్గొన్న, ప్రమేయం ఉన్న చిట్టి బాబుతో పాటు మామిళ్లగూడెం, గుట్టగూడెం గ్రామాలకు చెందిన కొర్రి నాగేంద్ర బాబు,కొర్స నాగరాజు సడియం హరిబాబు, సడియం వెంకటేష్,గుండిబోయిన వెంకటేష్ మొత్తం ఏడుగురిపై వన్య ప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి రవికిరణ్ తెలిపారు. పరారైన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.