17-11-2025 04:28:31 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయ సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అభినందించారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో చాంద (టి) గ్రామానికి చెందిన గణేష్ ప్యానెల్ విజయం సాధించగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నూతనంగా ఎన్నుకున్న అధ్యక్ష కార్యదర్శులతో పాటు నూతన కార్యవర్గ సభ్యులను శాలువాలు కప్పి సన్మానించారు. సేవా సామాజిక దృక్పథoతో పాటు ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాల్లో అయ్యప్ప సేవా సంఘం ముందు వరుసలో నిలుస్తుందని అన్నారు. సంఘానికి తన వంతు చేయూతని అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.