17-11-2025 04:25:21 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని నీరుకుల్లా రోడ్లో గల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో కార్తీక సోమవారంను పురస్కరించుకొని పలువురు భక్తులు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారు. పూజారి సద్దనపు రవీంద్ర చారి ప్రత్యేక పూజలు చేశారు. గురుస్వామి మిట్టపల్లి మురళీధర్ అయ్యప్ప స్వాములకు మాల ధారణ చేశారు. 36 సంవత్సరాలు నుండి తాను అయ్యప్ప మాల వేసుకొని శబరిమలకు వెళ్లడం జరుగుతుందని మిట్టపల్లి మురళీధర్ తెలిపారు.
సుల్తానాబాద్ ప్రాంతంలో అయ్యప్ప స్వాములకు అతనే కొన్ని సంవత్సరాలుగా మాల వేస్తున్నారు. అయ్యప్ప స్వామి మాల ధరించడం వల్ల కుటుంబ సభ్యులు ఆ హరిహర సుతన్ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉంటారని మిట్టపల్లి మురళీధర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆలయ భూ దాత శనిగరం శంకరయ్య, అయ్యప్ప మాలదారులు కొమురవెల్లి హరీష్, సీనియర్ జర్నలిస్టు , పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్ తోపాటు పలువురు పాల్గొన్నారు.