calender_icon.png 12 July, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లి గురించి ఆలోచించినా భయమేస్తోంది

12-07-2025 12:19:04 AM

పెళ్లి గురించి ఆసక్తిక ర వ్యాఖ్యలు చేసింది శ్రుతిహాసన్. వివాహ బం ధం పట్ల తనకు భయం ఉందని, అందుకే ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని తెలిపిందీ తమిళ సోయగం. రజనీకాంత్ ‘కూలీ’లో శ్రుతిహాసన్ ఓ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో చిత్రబృందంతోపాటు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న శ్రుతిహాసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్న తన శ్రుతి పెళ్లి ముచ్చటను కూడా ప్రస్తావించింది. “నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి జీవితమంతా కష్టపడ్డాను. ఆ గుర్తింపును ఒక కాగితం ముక్కతో ముడి పెట్టాలన్న ఆలోచన కూడా నన్ను భయానికి గురిచేస్తోంది.

వివాహ బంధాన్ని, ఆ వ్యవస్థలో ఉన్న విలువలను నేను గౌరవిస్తాను. కానీ, వాటిని ధ్రువీకరించడానికి చట్టపరమైన కాగితం అవసరం లేదు అని నా అభిప్రాయం. ఒకసారి నేను పెళ్లికి చాలా దగ్గరగా వెళ్లాను. కానీ, అది ముడి పడలేదు. ఇద్దరు మనుషులు ఒక్కటవ్వాలంటే వారి అభిప్రాయాలు కలవాలి. అయినా, పెళ్లంటే ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు. అది జీవిత కాలపు బాధ్యత” అని చెప్పుకొచ్చింది.

ఇంకా శ్రుతిహాసన్ తన తండ్రి కమలహాసన్, రజనీకాంత్ మధ్య పోలిక గురించి చెప్తూ.. “మా నాన్న, రజనీకాంత్.. ఇద్దరూ తమిళ ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటివారు. రజనీకాంత్ సూపర్ స్టార్ ఎన్నాళ్ళు మా నాన్న దృష్టి కోణంలోనే ఆయనను చూశాను ‘కూలి’ సినిమా కోసం ఆయనతో కలిసి నటించినప్పుడు చాలా విషయాలు తెలుసుకున్నాను.

ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు చాలా ఆనంద పడుతున్నాను. ఇండస్ట్రీలో చాలామంది గొప్ప న టులు ఉన్నారు. ఎవరి ప్రత్యేకతలు వారికి ఉం టాయి. రజనీకాంత్, కమలహాసన్, అమితాబ్ బచ్చన్.. ఇలా ఒకరితో ఒకరిని పోల్చలేం” అని తెలిపింది.