12-07-2025 12:17:37 AM
రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న యాక్షన్ మూవీ ‘కూలీ’. నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్‌ను విడుదల చేశారు. మోనికా అనే ఈ పాట ఎక్స్‌ప్లోజివ్ నెంబర్ గా అదరగొట్టింది. సముద్ర నేపథ్యంలో సెట్ చేయబడిన ఈ పాటలో పూజా హెగ్డే రెడ్ కలర్ డ్రెస్‌లో, ప్రతి ఫ్రేమ్‌ను తన అద్భుతమైన మూవ్స్‌తో కట్టిపడేసింది.
ఆమెతో పాటు సౌబిన్ షాహిర్ కూడా కనిపించడం ట్రాక్‌కు ఫన్ ఎనర్జీ తీసుకువచ్చింది. అనిరుధ్ రవిచందర్ చార్ట్‌బస్టర్‌ను కంపోజ్ చేశారు. అనిరుధ్, శుభలక్ష్మి కలిసి ఈ సాంగ్ పాడారు. ఈ సినిమా డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ఆసియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. ఆగస్టు 14న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్, ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్.