05-10-2025 12:47:08 AM
-రేపు జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులతో చర్చలు
-మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): వచ్చేవారంలో ఎటువంటి పరిస్థితు ల్లోనైనా పత్తి కొనుగోళ్లు చేయాల్సిందేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 341 జిన్నిం గ్ మిల్లులు ఉన్నా...ఇప్పటి వరకు పత్తి కొనుగోలు టెండర్లలో ఎవరూ పాల్గొనలేదని, వీరి సమస్యను కేంద్రం దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లినట్లు తెలిపారు. సోమవారం మరోసారి జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులతో సమావేశమై, వారికున్న సందేహాలు, భయాలను తొలగించాలని అధి కారులకు ఆయన శనివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. అధిక వర్షాల వల్ల రైతులు అనుకున్నంత మేర దిగుబడులు లేవని, ఈ సందర్భంలో రైతు ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదని ఆయన హెచ్చరించారు.