calender_icon.png 23 October, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప ఆలయ అభివృద్ధికి తోడ్పాటునందిస్తా

23-10-2025 02:11:44 AM

బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి

ఎల్లారెడ్డి అక్టోబర్ 22,(విజయ క్రాంతి); ఎల్లారెడ్డి పట్టణంలో అయ్యప్ప ఆలయానికి తన వంతు కృషి చేస్తానని ఆ దేవుడికి నేను రుణపడి ఉన్నానని నాకు, ఆ భగవంతుడు సేవలందించడానికి తగినంత శక్తిని, ఎల్లప్పుడు ప్రసాదించాలని, బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి అన్నారు.ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని అయ్యప్ప ఆలయ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా, భక్తునిగా తన వంతు కృషి చేస్తానని జపాన్ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర నేత డాక్టర్ పైడి ఎల్లారెడ్డి తెలిపారు.

బుధవారం ఆయన అయ్యప్ప ఆలయానికి మరుగుదొడ్లు, షో చాలాయాల నిర్మాణానికి భూమి పూజ చేసి, మొదటి విడతగా రూ.50 వేలు ఆలయ కమిటీ చైర్మన్ పద్మ శ్రీకాంత్ కు అందజేశారు. అన్నదానం కార్యక్రమానికి కూడా తన తోడ్పాటు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆనంతరం అయన అయ్యప్ప ఆలయంలో ప్రతీ బుధవారం జరిగే అన్నప్రసదా వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామికి అన్నప్రసాదం ఆలయ పూజారి శ్రీనివాస్ రావుతో పెట్టించి పూజలు చేసి, స్వయంగా భక్తులకు ఆయనే వడ్డించి అన్నప్రసాదం స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మెన్ పద్మ శ్రీకాంత్, వైస్ చైర్మెన్ కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్ నాథ్, గురుస్వామి చంద్రం, ప్రజా ప్రతినిధులు నాయకులు, ఆకుల కిష్టయ్య, పప్పు వెంకటేశం, ప్యాలల రాములు, నవీన్, బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు నర్సింలు, బీజేపీ సీనియర్ నేతలు దేవేందర్, బాలకిషన్, నక్క గంగాధర్, రాజేశ్వర్, కాశినాథ్, ప్రసాద్, అల్లం పండరి బీజేపీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.