calender_icon.png 23 October, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన భోజనం అందించాలి

23-10-2025 02:10:18 AM

కలెక్టర్ ఆశిష్ సంగువాన్ 

తాడ్వాయి, అక్టోబర్, 22( విజయ క్రాంతి ) : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజ నం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్ వన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ ఉన్నత పాఠశాలను ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ఎంతో ప్రతిష్టా త్మకంగా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనం పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.

విద్యార్థులకు పూర్తిస్థాయిలో నాణ్యమైన భోజనం అందిస్తూ వారు ఆరోగ్యంగా ఉండేలా చూడాలన్నారు.  ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిందని ఈ పథకాన్ని సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. డిఇఓ రాజు, ఎంపీడీవో సాజిద్ అలీ, తహాసిల్దార్ శ్వేత, ఎంఈఓ రామస్వామి, ఎంపీఓ సవిత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.