29-08-2024 12:00:00 AM
వృతి వాఘని.. పేరు కొత్తగా ఉన్న ఈ భామ ‘కొత్త కొత్తగా’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు హీరో నారా రోహిత్‌తో కలిసి మరోమారు తెలుగు నాట సందడి చేయనుంది. ఈ సొగసరి కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుందరకాండ’ సెప్టెంబర్ 7న విడుదల కానుంది. విభిన్నమైన కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ ఇటీవలే మొదలయ్యాయి. మేకర్స్ టీజర్ లాంచ్‌తో ప్రచార కార్యక్రమాలు షురూ చేయగా, ఈ కార్యక్రమంలో వృతి పాల్గొంది. ఈ సందర్భంగా తనను పలక రించిన మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకుందీ ముద్దుగుమ్మ. “నేను చిన్నప్పటి నుంచే వివిధ బ్రాండ్లకు సంబంధించిన ప్రకటనల కోసం పనిచేయడం మొదలుపెట్టాను.
2008లో ‘జై శ్రీకృష్ణ’ సీనియల్ తొలిసారి నటించాను. అందులో నేను యువ రాధ పాత్ర పోషించాను. రాధ క్యారెక్టర్‌తో నటిగా అరంగేట్రం చేయడం మంచి అనుభూతినిచ్చింది. ఆ తర్వాత హిందీలో సీరియల్స్‌తోపాటు ‘ఆర్య’ వెబ్ సిరీస్ రెండు సీజన్లలో నటించాను. విహార యాత్రలు చేయడం నాకు చాలా ఇష్టం. అందుకే వీలు చిక్కినప్పుడల్లా కొత్త ప్రదేశాలను చుట్టేస్తూ ఉంటాను. సంప్రదాయ దుస్తులు ధరించడానికే అమితంగా ఇష్టపడతాను. నేను భరతనాట్యం నేర్చుకున్నా. ఇప్పటికీ స్టేజ్ ప్రదర్శనలు ఇస్తూ ఉంటాను. మహేంద్ర సింగ్ ధోని అంటే ఇష్టపడే నాకు.. ఓ ప్రకటన కోసం అతనితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఆయనతో చేసిన జియో మార్ట్ యాడ్ ఎప్పటికీ మర్చిపోలేను” అని చెప్పింది.