calender_icon.png 16 July, 2025 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీలి మేఘాలలో..

29-08-2024 12:00:00 AM

నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘35 -చిన్న కథ కాదు’. రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. అయితే, ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా ‘నీలి మేఘములలో..’ పాటను విడుదల చేశారు. కథానాయకానాయికలను పరిచయం చేస్తూ సాగే ఈ పాటకు వివేక్ సాగర్ స్వరాలు సమకూర్చగా, భరద్వాజ్ గాలి సాహిత్యం అందించారు. పృథ్వీ హరీశ్ పాడిన ఈ పాట వినసొంపుగా ఉంది. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీగా అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 6న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.