06-12-2025 12:00:00 AM
వెయ్యి రోబోటిక్ జీర్ణకోశ శస్త్రచికిత్సలు పూర్తి చేసుకున్న విశాఖపట్నం కేర్ హాస్పిటల్స్ డాక్టర్ బిబి దాస్
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): కేర్ హాస్పిటల్స్, విశాఖపట్నానికి చెందిన ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డా.బి. బి. దాస్, కేవ లం 18 నెలల్లో వెయ్యి రోబోటిక్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూ ర్తి చేశారు. ఇది కేవలం ఒక సంఖ్య కాదు రో గులకు అత్యంత కచ్చితత్వం, ఇంకా ఎక్కువ భద్రత, తక్కువ నొప్పి, చాలా త్వరగా కోలుకునే అవకాశం కల్పించడంలో కేర్ హాస్పిట ల్స్ తీసుకుంటున్న అధునాతన టెక్నాలజీ పురోగతికి ఇది పెద్ద నిదర్శనం.
గ్యాస్ట్రోఇంటెస్టినల్ అంటే శరీరంలో ఆహారం జీర్ణమయ్యే అవయవాలు (కడుపు, పేగులు, కాలేయం మొదలైనవి). వీటిలో వచ్చే సమస్యలకు శస్త్రచికిత్సలు సాధారణంగా చాలా క్లిష్టమైనవే. అయితే డా విన్సీ రోబోటిక్ సర్జికల్ సిస్టం వంటి అత్యాధునిక రోబోటిక్ సాంకేతికత వినియోగంతో శస్త్రచికిత్స చిన్న కోతలతో, తక్కువ రక్తస్రావంతో, చాలా కచ్చితంగా, సురక్షితంగా చేయడం సాధ్యమవుతోంది. దీనివల్ల రోగులు తక్కువ నొప్పితో, తక్కువ ఆసుపత్రి కాలంతో, వేగంగా ఇంటికి తిరిగి వెళ్తున్నారు.
దశాబ్దాల అనుభవం కలిగిన డా.దాస్, చిన్న కోతలతో చేసే మినిమల్ ఇన్వాసివ్ శస్త్రచికిత్సలు, రోబోటిక్ శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉన్న నిపుణులు. ఆ యన ఆంధ్రప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్గఢ్ మరి యు సమీప ప్రాంతాల రోగులకు క్లిష్టమైన జీర్ణాశయ సంబంధిత సమస్యలకు అత్యంత కచ్చితమైన, భద్రమైన చికిత్స అందిస్తున్నా రు. డాక్టర్ బి. బి. దాస్ మాట్లాడుతూ, 18 నెలల్లో 1,000 రోబోటిక్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ శస్త్రచికిత్సలను పూర్తి చేయడం, ఆధునిక రోబోటిక్ టెక్నాలజీ ఆరోగ్య సేవలను ఎంత వేగంగా మార్చుతోందో చూపిస్తోందని చె ప్పారు.
50 ఏళ్ల మహిళకు సూది గుచ్చినంత చిన్న పోర్టుల ద్వారా ఒకేసారి రోబో టిక్ పిత్తాశయం తొలగింపు, హిస్టెరెక్టమీ చేసినట్టు తెలిపారు. పునరావృతమయ్యే పోస్ట్-స ర్జరీ హెర్నియాతో బాధపడుతున్న 63 ఏళ్ల రోగికి, లోతైన మెష్ అమరిక, ఖచ్చితమైన కుట్టుతో మచ్చలు లేకుండా రోబోటిక్ చికిత్స చేసినట్లు తెలిపారు. ఇలా వెయ్యి వరకు చికిత్సలు నిర్వహించినట్టు వెల్లడించారు. చాలా తక్కువ సమయంలోనే వెయ్యి రోబోటిక్ శస్త్రచికిత్సలు చేయడం మా వైద్యుల నైపుణ్యాని కి ఉదాహరణ అని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జి.సుఖేష్ రెడ్డి అన్నారు.