calender_icon.png 15 July, 2025 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల కోసం మిర్చి పరిశ్రమకు ప్రయత్నిస్తా

15-07-2025 12:27:57 AM

ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి  శ్రీధర్ బాబు

మహదేవపూర్ (భూపాలపల్లి) జులై 14 (విజయ క్రాంతి): మిర్చి(మిరపకాయ) రైతులకు గిట్టుబాటు ధర లభించాలంటే రైతాంగం లాభాలు అర్జించాలంటే  మిర్చి పౌడర్ పరిశ్రమ మిర్చి రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  నిర్వహించడం ఒక్కటే మార్గం అని రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం మహదేవపూర్ మండల కేంద్రంలోని మిర్చి రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ మిర్చి రైతులకు తగినంత లాభాలు రాకపోవడం చాలా బాధాకరమని అన్నారు .

మిర్చి రైతులు మిర్చి పౌడర్ పరిశ్రమకు తగినంత పంటను ఉత్పత్తి చేసే విధంగా సంఘం ప్రయత్నిస్తే తాను శాశ్వత పరిశ్రమ ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలను ఒప్పించే ప్రయత్నం చేస్తానని అన్నారు. రైతులందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే తాను పరిశ్రమల మంత్రిగా బాధ్యతలో ఉన్నానని, తాను రైతుల సంక్షేమం పట్ల శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. మిర్చి రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంత్రిని మిర్చి రైతులు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మిర్చి సంఘము అధ్యక్షులు  మేసినేని కృష్ణారావు ఆధ్వర్యంలో రైతులకు తగినంత యూరియాను సరఫరా అయ్యేలా చూడాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. మిర్చి రైతుల సంక్షేమ సంఘం స్థలం ఉండగా భవనానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.  తడకల జగదీశ్వర్, తాటికొండ శ్రీనివాస్, మేడవరపు వెంకటేశ్వరరావు, ఎర్రవెల్లి లింగారావు, ఒలిశెట్టి సంజీవ్, కవ్వాల శేఖర్, జాడీ గట్టయ్య  పాల్గొన్నారు.

చిన్న కాలేశ్వరం ముంపు రైతులతో సమావేశం  

మహదేవపూర్, (భూపాలపల్లి) జులై 14 (విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా ముంపునకు గురవుతున్న భూముల  రైతులతో  సమావేశమై రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. కాళేశ్వరం దిగువన బీరసాగర్ వద్ద ప్రాజెక్టు ఏర్పాటు చేసి ఐదు మండలాలు మహదేవపూర్, పలిమెల, కాటారం, మహముత్తారం, మలహర్రావు, మండలాలలోని చెరువులకు పైపులైన్ల ద్వారా చెరువులలో నీటిని నింపి రైతులు రెండు పంటలు పండించుటకు ఈ ప్రాజెక్టు దోహదం పడటకు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించినారు.

అనంతర జరిగిన  పరిణామాల వల్ల చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు తెర మరగయింది. మళీ మంతిని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు రాష్ట్రమంత్రి  అండతో మా రైతులకు ఏదైనా ఉపకారం చేయాలని ఉద్దేశంతో మళ్లీ చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు పనులు ప్రారంభించారు.  ఇటీవల మంతిని కి వచ్చిన మంత్రి శ్రీధర్ బాబుకు రైతులందరూ విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకున్న మంత్రి శ్రీధర్ బాబు రైతుల వద్దకే వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.

ఈరోజు మహదేవపూర్ మండల కేంద్రంలోని పోత వెంకటస్వామి ఇంటి వద్ద రైతులతో సమావేశం నిర్వహించారు. ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఆధ్వర్యంలో ఈ కాలువల నిర్మాణం ద్వారా ఏ రైతులయితే భూములు కోల్పోతున్నారో వారి జాబితా తీసుకొని వారి అభిప్రాయాలను నాకు అందజేయాలని ఆదేశించారు. ఈ పరిమాణంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.