calender_icon.png 15 July, 2025 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి అర్జీలను పరిష్కరించాలి

15-07-2025 12:29:10 AM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, జూలై 14 (విజయ క్రాంతి):! ప్రజావాణి ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా  కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్  అధికారులను ఆదేశించారు.  సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ఐడిఓసిలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్ లతో కలిసి ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు.

సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి 95 అర్జీలు వచ్చినాయి. ఈ సందర్భంగా జిల్లా  కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ,  ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి శనివారంలోగా దరఖాస్తులను పరిష్కరించి ఆర్జిదారులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.