13-07-2025 01:21:37 AM
- ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
- తుర్కయాంజాల్‌లో -పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 12 (విజయక్రాంతి): తుర్కయాంజాల్ మున్సిపా లిటీ పరిధిలోని రాగన్నగూడ, కమ్మగూడ, మన్నెగూడ, తుర్కయాంజాల్ వార్డులలో పలు అభివృద్ధి పనులకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ఆరంభమైన నాటి నుంచి గతంలో ఎన్నడూ లేనంతగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధి పథం లో దూసుకుపోతుందని అన్నారు. ప్రజలకు సేవ చేయడం తమ కర్తవ్యమని గుర్తు చేస్తూ, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రామ్‌రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.