calender_icon.png 29 January, 2026 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాప్-10లోకి సూర్యకుమార్

29-01-2026 01:11:50 AM

అగ్రస్థానంలో అభిషేక్‌శర్మ

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్

దుబాయ్, జనవరి 28 : న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో రాణిస్తున్న భారత క్రికెటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటారు. తాజా గా విడుదలైన జాబితాలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాప్ దూ సుకొచ్చాడు.దాదాపు ఏడాది తర్వాత హాఫ్ సెంచరీ చేసిన సూర్యకుమార్ ఐదు స్థానాలు మెరుగై ఏడో ర్యాంకులో నిలిచాడు. ఈ సిరీస్‌లో సూర్య వరుసగా 32, 82 నాటౌట్, 57 నాటౌట్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం భారత కెప్టెన్ 717 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. అలాగే సూపర్ ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ తన రేటింగ్ పాయింట్లను 929కు పెంచుకుని అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. అటు గాయంతో ఈ సిరీస్‌కు దూరమైనప్పటకీ తిలక్ వర్మ తమ మూడో ప్లేస్‌ను నిలుపుకున్నాడు.

హార్థిక్ పాండ్యా 53వ ర్యాంకులోనూ, దూబే 58, రింకూ సింగ్ 68వ స్థానంలోనూ నిలిచారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వరుణ్ తప్పిస్తే మరే భారత బౌలర్ కూడా టాప్ లేడు. స్టార్ పేసర్ బుమ్రా నాలుగు స్థానాలు మెరుగై 13వ ప్లేస్‌లోనూ, స్పిన్నర్ రవి బిష్ణోయ్ 13 స్థానాలు మెరుగై 19వ ర్యాంకులోనూ నిలిచాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో హార్థిక్ పాండ్యా 3వ ర్యాంకులోనూ, దూబే 12వ స్థానంలోనూ నిలవగా జింబాబ్వే క్రికెటర్ సికిందర్ రాజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.