calender_icon.png 29 January, 2026 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజస్థాన్‌కు రూ.11,956 కోట్ల బిడ్

29-01-2026 01:08:54 AM

ముంబై, జనవరి 28: ఐపీఎల్ అంటేనే రికార్డులకు చిరునామా.. కేవలం గ్రౌండ్‌లోనే కాదు ఆఫ్ ది ఫీల్డ్‌లోనూ రికార్డుల మీద రికార్డులు నమోదవుతూనే ఉంటాయి. బ్రాడ్‌కా స్టింగ్ రైట్స్‌తో పాటు ఫ్రాంచైజీల విలువ విషయంలో సరికొత్త రికార్డులను చూస్తూనే ఉన్నాం. తాజాగా ఐపీఎల్ రాజస్థాన్ రాయ ల్స్ ఫ్రాంచైజీ కోసం భారీ స్థాయిలో బిడ్ దాఖలైంది. ఎవ్వరూ ఊహించని విధంగా రూ.11,956 కోట్లతో రాయల్స్ ఫ్రాంచైజీ కోసం నాలుగు బిడ్లు దాఖలయ్యాయి. వీటిలో ఇప్పటికే రాజస్థాన్ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టిన కల్ సొమానీ భారీ ధరకు బిడ్ దాఖలు చేశారు.

అలాగే టైమ్స్ ఇంటర్‌నెట్, బ్లాక్‌స్టోన్, కార్లుల్ గ్రూప్ కూడా బిడ్లు దాఖ లు చేసి రేసులో నిలిచాయి. ఒకవేళ ఈ డీల్ కుదిరితే మాత్రం ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఫ్రాంచైజీగా రాజస్థాన్ రాయల్స్ రికార్డులకెక్కుతుంది. అటు రాయ ల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కూడా అమ్మకం కోసం రెడీ అయింది. ఆ ఫ్రాంచైజీ రూ.17,500 కోట్ల వరకూ బిడ్డింగ్ ఆశిస్తోంది. దాని కంటే ముందే రాయల్స్ ఫ్రాంచైజీ డీల్ ముగిసేలా కనిపిస్తోంది. కాగా ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ గుజరాత్ టైటాన్స్ అత్యధిక ధర కలిగిన ఫ్రాంచైజీగా ఉంది. టొరంటో గ్రూప్ దీనిలో 67 శాతం వాటాను రూ.5,025 కోట్లకు కొనుగోలు చేయగా.. మొత్తం ఫ్రాంచైజీ విలువ రూ.7,500 కోట్లుగా అంచనా వేశారు.