22-08-2025 11:07:51 PM
ప్రతి నీటి బొట్టు ను వడిచిపెట్టి భూగర్భ జలాలను పెంపొందించుకోవాలి
మౌలిక వసతుల్లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం
డిప్యూటీ కమిషనర్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్ రావు
మునుగోడు,(విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్ రావు అన్నారు. శుక్రవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల జాతరలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాలలో గ్రామ సభ నిర్వహించి పనులు ప్రారంభించి కొంపల్లి గ్రామంలో జరిగిన గ్రామసభ హాజరై మాట్లాడారు.
పనుల భూగర్భ జలాలు పెంపొందించడానికి ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి మన గ్రామంలోని ఇంకే పని చేసినట్లయితే భూగర్భ జలాలు పెరగటానికి అవకాశం ఉంటుంది అని తెలియజేశారు. గ్రామంలో జరిగే పనులను గ్రామ పంచాయతీ వద్ద వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రైమరీ స్కూల్స్ లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ప్రారంభించారు. అనంతరం గ్రామపంచాయతీ సిబ్బందిని సన్మానించారు.