22-08-2025 11:00:10 PM
గార్ల,(విజయక్రాంతి): గార్ల మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని ఇల్లెందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య అన్నారు.శుక్రవారం మండల పరిధిలోని,చిన్న బంజారా గ్రామపంచాయతీలోని కట్టుకుంట తండాలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా 12 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడి భవనాన్ని అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, సంక్షేమ పథకాలు ప్రజలందరికీ వర్తింప చేస్తాయని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అంగన్వాడి భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి, వినియోగంలోకి తేవాలని అధికారులను ఆదేశించారు.