22-09-2025 09:12:01 PM
ములకలపల్లి,(విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సోమవారం ములకలపల్లి అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభత్సవాలు చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. తొలుత చంద్రుగొండ మండల కేంద్రంలో చింతల వెంకటేశ్వర్లు గారికి అత్యవసర సర్జరీకి రెండు లక్షల 50 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసి చెక్కును అందించారు.
అనంతరం స్థానికంగా ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ములకలపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మానసిక అంగవైకల్య వికలాంగుల కోసం 28 లక్షల 50 వేలతో నూతనంగా నిర్మించే మూడు భవిత భవనాలకు శంకుస్థాపనలు చేశారు. అన్నపురెడ్డిపల్లి రైతువేదికలో 18 లక్షల 2 వేల 88 రూపాయలు, ములకలపల్లి రైతువేదికలలో రూ.32 లక్షల 3 వేల 712 లతో ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. అన్నపురెడ్డిపల్లి సోషల్ వెల్ఫేర్ వసతిగృహం, ములకలపల్లి జూనియర్ కళాశాల, ములకలపల్లి కేజీబీవీ పాఠశాలలలో రేనోవేషన్ మరియు రిపేర్ వర్క్ ల నిమిత్తం 40 లక్షలతో చేపట్టబోయే పనులను ప్రారంభించారు. ములకలపల్లి మండలం కంపగూడెం గ్రామంలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు బతుకమ్మ వేడుకలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.