calender_icon.png 19 May, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొంగులేటికి నీరా‘జనం’

19-05-2025 12:53:32 AM

- కోదాడ, పాలేరు, మధిర, ఖమ్మం నియోజకవర్గాల్లో మంత్రి శ్రీనివాస రెడ్డి పర్యటన

- ఘనస్వాగతం పలికిన అభిమానులు

-  పలు శుభకార్యక్రమాలకు హాజరు

భద్రాద్రి కొత్తగూడెం/ ఖమ్మం మే 18 (విజయ క్రాంతి) తెలంగాణ రెవెన్యూ, గృహ ని ర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి నీరా‘జనం’ పలికారు. కోదాడ, పాలేరు, మధిర, ఖమ్మం నియోజకవర్గాల్లో ఆదివారం పర్యటించిన ఆయనకు స్థానిక కాంగ్రెస్ పార్టీ అభిమానులు, స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికి వారి అభిమానాన్ని చాటుకున్నారు.

ఈసందర్భంగా మం త్రి పొంగులేటి ఆయా ప్రాంతాల్లో జరిగిన శుభకార్యక్రమాలకు హాజరైయ్యారు. కోదా డ నియోజకవర్గంలోని మోతె మండలం గొ ల్లగూడెంలో జరిగిన బత్తుల నాగేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నా రు. పాలేరు నియోజవకర్గంలోని కూసుమంచి లో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ నర్సింహారావు తల్లి చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.

ధర్మతండాలో గుగులోత్ ఉపేందర్ కుమార్తె వివాహానికి హాజరయ్యారు. నేలకొండపల్లి మండలం అమ్మగూడెంలో పసుపులేటి సత్యనారాయణ కుమార్తె వివా హ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని ఆరెకోడు తండా, క స్నాతండా, తనగంపాడు, తీర్థాల గ్రామాల్లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.

కాచిరాజుగూడెంలో పలువురికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు. అదేవిధంగా ఖమ్మం నియోజకవర్గంలోని ఎస్‌ఆర్ హోమ్స్ లో జరిగిన ఉప్పల మ్మ వేడుకలో, ఉషాహరి కన్వెన్షన్ హాల్లో జ రిగిన వివాహ వేడుకలో పాల్గొన్నారు. మధి ర నియోజకవర్గంలోని ముదిగొండ మండ లం కట్టకూరు, ముదిగొండ గ్రామాల్లో జరిగిన వివాహ వేడుకల్లో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, పట్టు వస్త్రాలను కానుకగా అందించారు.