19-05-2025 12:52:03 AM
భద్రాద్రి కొత్తగూడెం/ ఖమ్మం, మే 18 (విజయ క్రాంతి) తుదిశ్వాస వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎర్రజెం డా నీడలో పోరాటం సాగించిన పోటు ప్రసాద్ నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు అని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు.
ఆదివారం బోనకల్ రోడ్డులోని ఆది త్య థియేటర్ సమీపంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దివంగత కా ర్మిక నేత పోటు ప్రసాద్ స్మారక స్తూపాన్ని ఆయన ఆవిష్కరించారు. అంతకు ముందు స్థానిక జెడ్పి సెంటర్ నుంచి స్తూపం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ -సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ పోటు ప్రసాద్ విద్యార్థి దశ నుంచి లౌకిక వామపక్ష భావజాలంతో పని చేశారన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాట మార్గమే సరైన మార్గమని నమ్మి తుదిశ్వాస వరకు అదే -పంథాలో పయనించారని తెలిపారు. విద్యార్థి నాయకునిగా, కార్మిక నేతగా, భారత కమ్యూనిస్టు పా ర్టీ జిల్లా -రథసారధిగా విభిన్న రూపాల్లో ఆయన పనిచేశారన్నా రు.
తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ప్రసాద్ తన చివరి కార్యక్రమాన్ని ఖమ్మం కార్పోరేషన్ 40వ డివిజన్లో నిర్వహించారని ఇక్కడి ప్రజలు ప్రసాద్ను ని రంతరం జ్ఞప్తికి -తెచ్చుకునే క్రమంలో స్మారక స్తూపాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. ప్రజా పోరాటాలు నిర్వహించ డమే ప్రసాద్‌కు -మనమిచ్చే ఘన నివాళి అన్నారు. స్మారక స్తూపం వద్ద సిపిఐ పతాకాన్ని రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి -ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శిఎస్ కె జానిమియా, కార్యవర్గ సభ్యులు బిజి క్లెమెంట్, పో టు కళావతి, మహ్మద్ సలాం, మేకల శ్రీనివాసరావు, పోటు రాజాసాత్విక్, పగడాల మల్లేష్, స్థానిక నాయకులు యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.