calender_icon.png 19 May, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలిమ్ కెమ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభం

19-05-2025 12:52:57 AM

హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): ఎలిమ్ కెమ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను చైర్మన్ పీవీ కృష్ణ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. “మా ఉత్పత్తుల ద్వారా మీ గృహము, ఆఫీసు పరిశుభ్రత, సంరక్షణ ఎలా చేసుకోవాలో సగర్వంగా ఆవిష్కరిస్తాము.

ఇక ఈ ఈవెంట్‌లో మా కంపెనీ రసాయన ఉత్పత్తులతో ఆరోగ్యకరమైన వాతావరణం ఎలా రూపుదిద్దుకోవచ్చన్నది తెలియజేయడంతో పాటు ఉత్తేజకరమైన కొత్త వ్యాపార అవకాశాలను కూడా తెలియజేస్తాము. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనాలని సూపర్ స్టాక్ పెట్టుబడిదారులు, జాతీయ, అంతర్జాతీయ డీలర్లు, విలువైన భాగస్వాములను ఆహ్వానిస్తోంది. ఈ కార్యక్రమం మా వినూత్న శ్రేణి పర్యావరణ అనుకూల రసాయన పరిష్కారాలను ప్రదర్శిస్తుంది.

మా కంపెనీ పర్యావరణ అనుకూలమైన, వినూత్నమైన, నైతికంగా అభివృద్ధి చేయబడిన రసాయన ఉత్పత్తులను రూపొందించడానికి అంకితమైన ఐఎస్‌వో సర్టిఫైడ్ బ్రాండ్, ఆర్ అండ్ డీ, అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలపై బలమైన ప్రాధాన్యతతో, మేము సురక్షితమైన, అధిక-పనితీరు పరిష్కారాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము” అని తెలిపారు.

సకాలంలో, సురక్షితమైన డెలివరీ, సురక్షితమైన, స్థిరమైన ప్యాకేజింగ్ -దీర్ఘకాలిక క్లయింట్- కేంద్రీకృత సంబంధాలు నెరుపుతామని చెప్పారు. ఇల్లు, ఆఫీస్ శుభ్రపరిచే పరిష్కారాలు.. ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, కిచెన్ క్లీనర్, డిష్ వాష్ జెల్, టైల్ క్లీనర్, గ్రానైట్ క్లీనర్, గ్లాస్ క్లీనర్, మల్టీ-పర్పస్ డిస్‌ఇన్సెక్టెంట్ స్ప్రే, స్టెయిన్లెస్ స్టీల్ పాలిష్ ఉంటాయన్నారు.

ఫాబ్రిక్, వ్యక్తిగత పరిశుభ్రత పరిష్కారాలు.. డిటర్జెంట్ లిక్విడ్, ఫాబ్రిక్ కండిషనర్, హ్యాండ్‌వాష్, శానిటైజర్ లిక్విడ్, ఎయిర్ ఫ్రెషనర్, రీడ్ డిఫ్యూజర్ ఆయిల్, స్పెషాలిటీ కేర్ ఉత్పత్తులు.. కార్ వాష్ షాంపూ, ఫర్నిచర్ క్లీనర్ ఉంటాయన్నారు. తమతో చేరి, పర్యావరణ అనుకూల రసాయన సంరక్షణ పరిష్కారాలలో కొత్త యుగంలోకి అడుగుపెట్టాలని పీవీ కృష్ణ కోరారు.