calender_icon.png 6 December, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వలస కూలీల పిల్లలను గుర్తించండి

06-12-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్, డిసెంబరు 5 (విజయ క్రాంతి): జిల్లావ్యాప్తంగా వలస కూలీలు, కార్మికుల పిల్లలను గుర్తించి వారిని ప్రత్యేక పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మండల విద్యాధికారులు, ఇటుక బట్టీలు, పరిశ్రమల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణంగా వలస కూలీలు ఎక్కువగా పనిచేసే చోటే వర్క్ సైట్ స్కూళ్లు ప్రారంభిస్తారని తెలిపారు.

కానీ పిల్లలకు పాఠశాల వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో వారి కుటుంబాలకు సమీ పంగా ఉన్న పాఠశాలల్లో ప్రత్యేక తరగతిలో బోధిస్తున్నామని అన్నారు. ఇటుక బట్టీలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలను గుర్తించి ఈ బడిలో చేర్పించాలని ఆదేశించారు. వారికి పోషకాహారం, దుస్తులు, పుస్తకాలు అందిస్తామని తెలిపారు. ఇటుక బట్టీల యజమానులు వారి సాయంగా పిల్లలకి రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు.

పదవ తరగతి చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి నూరు శాతం ఫలితాలు వచ్చేలా చూడాలని అన్నారు. ప్రత్యేక అధికారులు పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న స్పెషల్ క్లాస్ లను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు స్లిప్ టెస్టులు నిర్వహిస్తూ బోర్డు పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి మొండయ్య, విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, మండల విద్యాధికారులుపాల్గొన్నారు.