calender_icon.png 13 August, 2025 | 6:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సౌత్ స్టార్లను సుందరి ఇమిటేట్ చేస్తే..

13-08-2025 12:51:36 AM

సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘పరమ్ సుందరి’. ఈ సినిమాను తుషార్ జలోటా దర్శకత్వంలో మ్యాడా క్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేశ్ విజన్ నిర్మిస్తున్నారు. సంజయ్ కపూర్, మంజ్యోత్ సింగ్, రెంజి పనీకర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రేమ, భావోద్వేగాలు, హాస్యం కలగలిసిన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

పంజాబీ అబ్బాయి, మలయాళీ అమ్మాయి ప్రేమకథాగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. జాన్వీ ‘సుందరి’ అనే ఓ మధ్యతరగతి అమ్మాయిగా కనిపించనుంది. అందంగా ఉండడం ఒక వరం అని భావించే ఆమెకు.. ఆ అందం తన జీవితంలో సమస్యలకు ఎలా కారణమైం దనే కథాశం ఆసక్తికరంగా ఉందనిపిస్తోంది. సుందరి పాత్రలో జాన్వీ నటన, అమాయకత్వం, భావోద్వేగాలు ఆకట్టుకున్నాయి.

గత  చిత్రాల కంటే ఈ సినిమాలోని జాన్వీ పాత్ర భిన్నంగా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఇందులో హీరోగా, సుందరి ప్రేమికుడు పరమ్‌గా సిద్ధార్థ్ మలోత్రా నటించాడు. ట్రైలర్ చివరిలో జాన్వీ.. మలయాళంలో మోహన్‌లాల్, తమిళ్‌కి రజినీ, ఆంధ్రలో అల్లు అర్జున్, కన్నడకి యష్.. అంటూ వాళ్లందరినీ మేనరిజాన్ని ఇమిటేట్ చేస్తూ చెప్పిన ఓ డైలాగ్ అభిమానుల్లో జోష్ నింపింది.