calender_icon.png 14 August, 2025 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరుడి వేషం కట్టాడమ్మా..

13-08-2025 12:50:10 AM

టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి టైటిల్ రోల్‌లో నటిస్తున్న తాజాచిత్రం ‘సతీ లీలావతి’. దేవ్ మోహన్ కథా నాయకుడు. తాతినేని సత్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్లపై నాగ మోహన్ బాబు ఎం, రాజేశ్ టీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి.

తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను సైతం విడుదల చేశారు. ‘చిత్తూరు పిల్ల’ అనే ఈ లిరికల్ వీడియో సాంగ్‌లో లావణ్య త్రిపాఠి పెళ్లి కూతురిలా ఆకట్టుకుంటోంది. ‘మెరికలాంటి పిల్లోడమ్మా.. చురుకు చూపు చిన్నోడమ్మా.. మనసులోంచి కాసేపైనా పోనేపోడమ్మా.. వలపు చిచ్చు పెట్టాడమ్మా.. వరుడి వేషం కట్టాడమ్మా..’ అంటూ సాగుతోందీ పెళ్లి పాట. మిక్కీ జే మేయర్ స్వరపర్చిన ఈ పాటకు వనమాలి సాహిత్యం అందించగా నూతన మోహన్, కృష్ణ తేజస్వి, రితేశ్ జీ రావు పాడారు.