13-08-2025 12:53:23 AM
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే చాలా రోజుల తర్వాత ఇటీవల సూర్య రెట్రో సినిమాలో హీరోయిన్‌గా కనిపించింది. తాజాగా రజనీకాంత్ ‘కూలీ’లో ‘మెనికా’ అనే పాటలో పూజ లుక్స్, డ్యాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ పాట సినిమాలో ఉండదంటూ మేకర్స్ ఇటీవల ప్రేక్షకులకు షాకిచ్చారు. దీంతో సోషల్ మీడి యాలో పూజ హెగ్డే గురించి ట్రోల్స్ ప్రారంభమయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ ఈ టోల్స్‌పై స్పందించింది. ‘నేను ఎయిర్‌పోర్ట్‌లో కనిపిస్తే, నాతో ఫొటో కోసం ఎందరో అభిమానులు దగ్గరికి వస్తారు.
అప్పుడు అర్థమైంది సోషల్ మీడియా అనేది నిజం కాదని. వాళ్లు ఫేమస్ అవ్వడం కోసమో, లేదా పోస్ట్ చేయడానికి ఏమీ లేకనో ట్రోల్స్ చేస్తుంటారు. ఇలాంటి సోషల్ మీడియా పోస్టులు టికెట్లుగా మారవు. అంటే వాళ్లంతా టికెట్ కొనుక్కొని సినిమాకు రారు. అందుకే ఎవరైతే టికెట్ కొని సినిమాకు వస్తారో, ఆ ప్రేక్షకుల గురించి నేను ఆందోళన చెందాలి తప్ప, వీళ్ల గురించి కాదు! నాకు లోకేశ్ ముందే చెప్పారు. మోనికా సాంగ్ కేవలం బిజినెస్ ప్రమోషన్స్ కోసమే అని.
ఈ పాటకు ఇటాలియన్ బ్యూటీ మోనికా బెలూచీ ఆకర్షణకు గురికావటం ప్రత్యేకం” అని పేర్కొంది. పూజా ఇంకా మాట్లాడుతూ.. “చాలా మంది ఉత్తరాది దర్శకులు నన్ను గ్లామర్ హీరోయిన్‌గానే చూశారు. గ్లామరస్ రోల్స్‌కే పరిమితం చేశారు. కానీ, దక్షిణాదిలో అది పూర్తి విభిన్నం. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు.. నన్ను ‘రాధేశ్యామ్’ సినిమాలో చూసి ‘రెట్రో’లో హీరోయిన్‌గా నటనకు ఆస్కారం ఉన్న రుక్మిణి పాత్ర కోసం నన్ను తీసుకున్నారు. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ ‘కూలీ’ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.