13-08-2025 12:00:00 AM
ఖమ్మం, ఆగస్టు 12 (విజయ క్రాంతి): అన్యాయానికి గురైన మహిళలలు నేరుగా హెల్ప్ లైన్ 181 ఫోన్ నెంబర్ కు కాల్ చేయవలసిందిగా ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అ న్నారు.మంగళవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలోని సఖి కేంద్రం, వన్ స్టాప్ సెంటర్, షీ టీమ్, భరోసా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సఖి కేంద్రానికి హఠాత్తుగా వివిధ కారణాలచే ఇంటి నుంచి బయటకు వచ్చిన బాధిత స్త్రీల కోసం తాత్కాలిక వసతి, అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు వారి తరుపున కేసుల నమోదు, ఎఫ్‌ఐఆర్ చేయించడం లాంటి సేవలు బాధిత మహిళలకు అందిస్తున్నారని క లెక్టర్ వివరించారు. భరోసా, సఖి కేంద్రాలలోని న్యాయ సలహా, మెడికల్, చిన్నారుల, కౌన్సిలిం గ్ స్టేట్మెంట్ రికార్డింగ్ చేయు గదులను, రిజిస్టర్ రికార్డ్ లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
సఖి వన్ స్టాప్ సెంటర్ ను ఆశ్రయించిన వారి వివరాలను, బాధితులకు అందించిన న్యాయ, వైద్య, వసతి ఇతర సదుపాయాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకొని, సెంటర్ నిర్వాహణ తీరును కలెక్టర్ ఆరా తీశారు.ఇప్పటివరకు 2338 కేసులకు వివిధ రకాల న్యాయ సేవలు అందించినట్లు నిర్వాహకులు కలెక్టర్కు వివరించారు. సఖి వన్ స్టాప్ సెంటర్ కి వచ్చే బాధితులకు అన్ని రకాల సేవలు,
సౌకర్యాలు సమకూర్చి న్యాయం అందించేలా చూడాలని కలెక్టర్ ఈ సందర్భంగా నిర్వాహకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, సెంటర్ అడ్మినిస్ట్రేటర్ ఆర్. అరుణ, కో-ఆర్డీనేటర్ జి. రాజకుమారి, లీగల్ కౌన్సిలర్ ఇ. అంజని, టి. శ్రావణి, కె. సరిత, యం. సుమలత, యం. పుష్పలత, యన్. నవీన్ కుమార్, సిబ్బంది, అధికారులు తదితరులు ఉన్నారు.