calender_icon.png 13 January, 2026 | 8:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలల చాటిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద

13-01-2026 02:55:50 AM

విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వనపర్తి ఎమ్మెల్యే 

వనపర్తి, జనవరి 12 (విజయక్రాంతి) : వివేకానంద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం వనపర్తి పట్టణంలోని వివేకానంద చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా స్వామి వివేకనంద విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వామి వివేకానంద జయంతిని యువజన దినోత్సవం గా జరుపుకుంటారని, యువకులు ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద జిల్లా కమిటీ సభ్యులు, వనపర్తి పట్టణ మాజీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

యువతకు వివేకానందుడు స్ఫూర్తి

చిన్నంబావి, జనవరి 12: యువత స్వామి వివేకనందను  స్ఫూర్తి తీసుకొని ముందుకు సాగాలని మండల మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో బిఆర్‌ఎస్ నాయకులు,కార్యకర్తలు వివేకనంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ యువత చేతుల్లోనే దేశభవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. యువతీ, యువకులు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శవంతంగా ఉండాలని అన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి, ఇదన్న యాదవ్,ఆనంద్ యాదవ్,రంజిత్ కుమార్, చిన్న కొండయ్య,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీరంగాపురం..

శ్రీరంగాపురం, జనవరి 12: స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం అని  శేరుపల్లి సర్పంచ్ వెంకటయ్య యువతకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటయ్య మాట్లాడుతూ స్వామి వివేకానంద  ఆదర్శాలను అలవర్చుకుని, సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతూ ఉత్తమ సమాజ నిర్మాణానికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, సేవాభావం పెంపొందించడంలో స్వామి వివేకానంద గారి బోధనలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. దేశ భవిష్యత్తును నిర్మించే యువతకు ఆయన ఆలోచనలు నిరంతర ప్రేరణగా ఉంటాయని పేర్కొంటూ, స్వామి వివేకానంద గారి జీవితం, వారి సందేశాలు నేటి సమాజానికి అత్యంత అవసరమని తెలిపారు.అనంతరం వివేకానంద జయంతి పురస్కరించుకుని యువకులు రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీహరి రాజు, రామచంద్రయ్య, తదితర యువకులు పాల్గొన్నారు.

చెన్నారంలో..

రేవల్లి జనవరి 12: మండల పరిధిలోని చెన్నారం గ్రామంలో స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలను సోమవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన వివేకానందుని చిత్రపటానికి గ్రామస్తులు, పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వక్తలు మాట్లాడుతూ.. భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద అని కొనియాడారు. నేటి యువతకు ఆయన ఒక గొప్ప మార్గదర్శి అని, ఆయన బోధనలు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ, గ్రామ ఉపసర్పంచ్, బిజెపి నాయకులు మణి వర్ధన్, కమ్మరి భాస్కర చారి, భాను ప్రసాద్, రాము, బీరయ్య, సాయి శంకర్, శివుడు, మధు, బిచ్చన్న, లింగం, కృష్ణ దాస్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.