16-05-2025 01:20:56 AM
ఉద్రిక్తతల తగ్గింపు కొనసాగాలని నిర్ణయించిన భారత్ డీజీఎంవోలు
న్యూఢిల్లీ, మే 15: భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల తగ్గింపును అలాగే కొనసాగించాలని రెండు దేశాల డీజీఎంవోలు (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్) నిర్ణయించారు. ‘ఇరు దేశాల డీజీఎంవోల మధ్య మే 10న ఒప్పందం కుదిరింది. ఆ చర్చల్లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని, సరిహద్దుల్లో ఉద్రిక్తతల తగ్గింపును అలాగే కొనసాగించాలని డీజీఎంవో లు నిర్ణయించారు.’ అని ఆర్మీ అధికారులు గురువారం తెలిపారు.