calender_icon.png 21 January, 2026 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుభరోసా ఇవ్వకుంటే ఊరుకోం

22-10-2024 12:22:53 AM

నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి

వెల్దుర్తి, అక్టోబర్ 21: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, రైతులను నిలువునా మోసం చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికి దక్కుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. సోమవారం వెల్దుర్తిలో రైతు భరోసా పై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా చేపట్టారు. పెద్దఎత్తున తరలివచ్చిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు, రైతులు ప్రభుత్వ దిష్టబొమ్మను దగ్ధం చేశారు.

మ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ కూడా ఇవ్వకుండా రైతుల వద్ద మొహం చాటేస్తుందన్నారు. వానాకాలం సీజన్‌లో ఇవ్వాల్సిన రైతు భరోసాను ఇప్పటికీ ఇవ్వకుండా దాటవేత ధోరణి సరికాదన్నారు. రైతు భరోసా ఇచ్చేవరకు ప్రభుత్వాన్ని విడిచిపెట్టమన్నారు.

అనంతరం మాసాయిపేట మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమం లో నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జి రాజిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అనంత్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.