08-05-2025 12:40:23 AM
పెబ్బేరు ఎప్రిల్ 7: గ్రామీణ వైద్యులు హద్దులు దాటి వైద్యం చేయరాదని గీతదాటితే సహించేది లేదని జిల్లా ఇన్ఛార్జి డీఈఎంఓ అశోక్ హెచ్చరించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఆలే శ్రీనివాసులు ఆదేశాల మేరకు బుధవారం పెబ్బేరు, శ్రీరంగాపూర్ ఉమ్మడి మండలాల్లో విస్త్రుత తనిఖీలు నిర్వహించారు.
సూగూర్ గ్రామంలో కొంతమంది ఫిర్యాదు మేరకు స్థానిక ఆర్ ఎం పీ వైద్య సేవాకేంద్రాలను తనిఖీలు నిర్వహించి ఒక ఆసుపత్రి ని సీజ్ చేశారు. శ్రీరంగాపూర్ మండలం లో మరో ఆసుపత్రిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజలకు అనుసంధానంగా మాత్రం ఉండాలని కోరారు.
అలా కాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, తమ పరిధికి మించి వైద్య సేవలు అందిస్తున్నారని, అలాంటి చర్యలు మానుకోవాలని కోరారు. లేని పక్షంలో అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక తనిఖీ బృందం సభ్యులు నర్సింగ రావు,మధుకర్ తదితరులు పాల్గొన్నారు.